తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే 'చౌకీదార్'​ జైలుకే" - మోదీ

కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే చౌకీదార్ నరేంద్ర మోదీ జైలుకు వెళ్లక తప్పదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రఫేల్​ ఒప్పందంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.  మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు రాహుల్​.

ప్రసంగిస్తున్న రాహుల్​ గాంధీ

By

Published : Apr 5, 2019, 12:21 AM IST

Updated : Apr 5, 2019, 12:28 AM IST

నాగ్​పూర్​ సభలో మోదీపై రాహుల్​ విమర్శలు
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే రఫేల్​ ఒప్పందంలో అవినీతికి పాల్పడిన ప్రధాని నరేంద్ర మోదీ జైలుకు వెళ్లక తప్పదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రఫేల్​పై సమగ్ర దర్యాప్తు చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.

మహారాష్ట్ర నాగ్​పుర్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. ప్రధానిపై వ్యంగాస్త్రాలు సంధించారు. మోదీకి వయసు మీదపడి.. అబద్ధాలను ప్రచారం చేసే తొందరలో ఉన్నారని ఆరోపించారు.

మోదీలా తాను అసత్యాలు ప్రచారం చేయలేనన్నారు. ఇంకో పదిహేనేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగాలన్న ఉద్దేశంతోనే కార్యకర్తలకు మరింత దగ్గరయ్యేందుకు కృషి చేస్తున్నానని రాహుల్ స్పష్టం చేశారు.

భాజపా కేవలం హామీలకే పరిమితమైందని విమర్శించారు రాహుల్​. మోదీ అబద్ధాలపై ఎప్పటికైనా నిజానిజాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. న్యాయ్ పథకం అమలు కచ్చితంగా సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు రాహుల్​.

దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిందని అన్నారు. తనతో 15 నిమిషాలు చర్చకు వచ్చే ధైర్యం మోదీకి లేదన్నారు రాహుల్​.

ఇదీ చూడండి:భాజపాకు శత్రువులు లేరు, ప్రత్యర్థులే: అడ్వాణీ

Last Updated : Apr 5, 2019, 12:28 AM IST

ABOUT THE AUTHOR

...view details