తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భూ దందాలో రాహుల్,ప్రియాంక'

రాబర్ట్​ వాద్రాతో పాటు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా భూ అక్రమాలకు పాల్పడ్డారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. అయితే భాజపా నిరాధార ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ఖండించారు.

స్మృతి ఇరానీ

By

Published : Mar 14, 2019, 10:44 AM IST

రాబర్ట్​ వాద్రాతో పాటు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా భూ అక్రమాలకు పాల్పడ్డారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇందుకు సంబంధించి మీడియాలో ప్రచురితమైన ఓ కథనాన్ని చూపించారు. ఈ 'కుటుంబ అవినీతికి' హస్తం పార్టీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

రాహుల్​ గాంధీ ఓ భూమిని కొన్నారు. ఈ వ్యవహారంలో హెచ్​.ఎల్​ పహవా పాత్ర ఉంది. ఆయనను ఇప్పటికే ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) ప్రశ్నించింది. వాద్రా భూ కొనుగోలు వ్యవహారంలో మహేశ్​కూమార్​ నగర్ పాత్ర కూడా ఉంది.​ ఆయుధ దళారీ సంజయ్​ భండారీ, వాద్రా స్నేహితుడైన సీసీ థంపీ ఈ భూ కొనుగోలుకు నిధులు సమకూర్చారు. యూపీఏ హయాంలో జరిగిన రక్షణ, పెట్రోలియం కొనుగోళ్లలో థంపీ, భండారీలు క్రియాశీలకంగా వ్యవహరించారు.
- స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి

స్మృతి ఇరానీ ఆరోపణలకు కాంగ్రెస్​ స్పందించింది. కేంద్రమంత్రి చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ఖండించారు.

ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని తెలిసినప్పుడు గత ఐదేళ్లలో భాజపా ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భాజపా గ్రహించింది. అందుకే ప్రధానితో పాటు ఆ పార్టీ నేతలందరూ రాహుల్​ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
-రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details