తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రమాణం చేసి, సంతకం మరచిన రాహుల్

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ లోక్​సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్​ గాంధీ కేరళలోని వయనాడ్​ స్థానం నుంచి గెలుపొందారు.

లోక్​సభ ఎంపీగా రాహుల్​ ప్రమాణం..

By

Published : Jun 17, 2019, 4:42 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వయనాడ్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ.. నేడు పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

లోక్​సభ ఎంపీగా రాహుల్​ ప్రమాణం..

ఆంగ్లంలో ప్రమాణం చేశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు. ఆ సమయంలో యూపీఏ కూటమి నేతలంతా చప్పట్లతో రాహుల్​ను అభినందించారు. ప్రమాణం పూర్తయిన తర్వాత.. సంతకం చేయకుండా వెనుదిరుగుతోన్న రాహుల్​ను అక్కడి సిబ్బంది పిలవగా.. నవ్వుతూ వెనక్కి వచ్చి పని పూర్తి చేశారు. అనంతరం సభ్యులందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్లి.. తన స్థానంలో కూర్చున్నారు.

2019 సార్వత్రికంలో వయనాడ్​తో పాటు.. ఉత్తర్​ప్రదేశ్​ అమేఠీ నుంచి బరిలోకి దిగారు రాహుల్​. వయనాడ్​లో గెలిచి.. అమేఠీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు.

ప్రమాణానికి కొన్ని నిమిషాల ముందు ట్వీట్​ చేశారు రాహుల్​ గాంధీ. నాలుగోసారి పార్లమెంటు సభ్యునిగా ప్రమాణం చేయబోతున్నాను అని ట్వీటారు.

''కేరళలోని వయనాడ్​కు ప్రాతినిధ్యం వహిస్తూ.. పార్లమెంటులో కొత్త ప్రయాణాన్ని ఆరంభించబోతున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత, విశ్వాసంతో ఉంటాను.''

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు, వయనాడ్​ ఎంపీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details