తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీకి రాహుల్​ ఫోన్​... ఎందుకో తెలుసా? - అతలాకుతలం

వరద గుప్పిట చిక్కిన కేరళను ఆదుకోవాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్‌ సహా ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఫోన్​లో ప్రధాని మోదీని కోరారు.

కేరళ కోసం మోదీతో మాట్లాడిన రాహుల్​

By

Published : Aug 9, 2019, 1:06 PM IST

వరద బీభత్సానికి కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్​లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ ఫోన్​లో​ సంభాషించారు.

బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు ప్రధాని హామీ ఇచ్చినట్లు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయకచర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, పౌరులకు పిలుపునిచ్చారు.

రాహుల్​ ట్వీట్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details