తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ హామీలు.. గాలిలో మేడలు కట్టడం ఒకటే'

కరోనా సంక్షోభంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. 21 రోజుల్లో కరోనాను ఓడిస్తామంటూ గాలిలో మేడలు కట్టారని.. కానీ అవన్నీ అబద్ధాలేనని రుజువైనట్టు పేర్కొన్నారు.

Rahul Gandhi slams Centre over failed promises during COVID-19 crisis
'మోదీ హామీలు.. గాలిలో మేడలు కట్టడం ఒకటే'

By

Published : Sep 16, 2020, 10:25 AM IST

Updated : Sep 16, 2020, 10:54 AM IST

కేంద్రంపై మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. కరోనా సంక్షోభంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

"'21 రోజుల్లో కరోనాను ఓడిస్తామని గాలిలో మేడలు కట్టడం, ఆరోగ్య సేతు యాప్​.. ప్రజలను రక్షిస్తుందని చెప్పడం, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ, మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదు.. అంతా నియంత్రణలోనే ఉంది'.. అని ఇలా భాజపా అబద్ధాలు చెప్పింది. అయితే వీటన్నంటిలోనూ ఒక నిజం మాత్రం ఉంది. అదే 'ఆపదలో అవకాశం' #పీఎం కేర్స్​."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

కరోనా వైరస్​, ఆర్థిక వ్యవస్థ, చైనాతో సరిహద్దు వివాదంపై గత కొంతకాలంగా ప్రభుత్వంపై కాంగ్రెస్​ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. మోదీ ప్రభుత్వం అటు ప్రజలకు నిజం చెప్పడం లేదని.. ఇటు విపక్షాల గొంతు అణచివేస్తోందని ఆరోపించింది.

ఇవీ చూడండి:-

Last Updated : Sep 16, 2020, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details