ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శల వర్షం కురిపించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రోజుకు రూ.3.5 ఇస్తూ రైతులను చులకన చేస్తున్నారని ఆరోపించారు. చత్తీస్‌గఢ్‌లో గిరిజనులు అధికంగా ఉండే కోరాపుట్ జిల్లాలో ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్. రుణమాఫీ హామీపై మరోసారి స్పష్టతనిచ్చారు.
నరేంద్ర మోదీ 15 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన 3 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేశారు. వాళ్లంతా దేశంలో ధనికులు. రైతుల రుణమాఫీకి డిమాండ్ చేస్తే... నరేంద్రమోదీ, నవీన్ పట్నాయక్ తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 10 రోజుల్లో ప్రతి రైతు రుణం మాఫీ చేస్తాం.
-రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ప్రధానమంత్రి స్వయంగా రఫేల్ ఒప్పందాన్ని తయారుచేసి, సమాంతరంగా చర్చలు జరిపారని దినపత్రికల్లో వచ్చిందన్నారు రాహుల్. అనిల్ అంబానీకి కాంట్రాక్టు ఇవ్వాలని మోదీ ఫ్రాన్స్‌ను డిమాండ్ చేశారని ఆరోపించారు.