తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ వ్యాఖ్యలు ఎవరు చేసినా ఆమోదించను: రాహుల్

మధ్యప్రదేశ్ భాజపా మంత్రిని ఉద్దేశించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. కమల్​నాథ్ కాంగ్రెస్​కు చెందినవారైనప్పటికీ.. వ్యక్తిగతంగా అలాంటి భాష ఉపయోగించడాన్ని ఇష్టపడనని అన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఎవరినీ కించపరచనప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలని కమల్​నాథ్ పేర్కొన్నారు.

Rahul Gandhi disapproves of Kamal Nath's 'item' remark against Minister Imarti Devi
ఆ వ్యాఖ్యలు ఎవరు చేసినా ఆమోదించను: రాహుల్

By

Published : Oct 20, 2020, 3:07 PM IST

Updated : Oct 20, 2020, 3:29 PM IST

మహిళా మంత్రిని ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కమల్​నాథ్ తన పార్టీకి చెందినవారైనప్పటికీ.. వ్యక్తిగతంగా అలాంటి భాష ఉపయోగించడాన్ని ఇష్టపడనని అన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరు చేసినా ఆమోదించేది లేదని తేల్చి చెప్పారు.

"దేశంలో అన్ని స్థాయిల్లో మహిళల పట్ల ప్రవర్తించే తీరు చాలా మెరుగుపడాల్సి ఉంది. మహిళలే మన గౌరవం. వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి భాష ఎవరు ఉపయోగించినా నేను ఆమోదించను. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరం."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

అయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కమల్​నాథ్ పేర్కొన్నారు. ఏ సందర్భంలో ఆ మాట అనాల్సి వచ్చిందో ఇప్పటికే స్పష్టంగా చెప్పానని అన్నారు. తాను ఎవరినీ కించపరచాలనుకోలేదని, అలాంటప్పుడు క్షమాపణలు ఎందుకు అడగాలని ప్రశ్నించారు. ఇప్పటికే తాను విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

అంతకుముందు, తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు కమల్​నాథ్. మంత్రి పేరు గుర్తు రాకపోవడం వల్లే 'ఐటం' అనే పదం వాడాల్సి వచ్చిందన్నారు.

ఇదీ చదవండి-'ఆమె పేరు గుర్తుకురాకే అలా అన్నాను'

Last Updated : Oct 20, 2020, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details