వీవీఐపీ విమానాల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశం కోసం సరిహద్దులో ప్రాణాలను పణంగా పెట్టే సైనికుల కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఏర్పాటు చేయలేని ప్రభుత్వం.. ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఏకంగా రూ.8400 కోట్లతో విమానాన్ని కొనుగోలు చేయడమేంటని మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయం? అని ట్విట్టర్ వేదికగా శనివారం ప్రశ్నించారు రాహుల్.
" మన జవాన్లు అమరులయ్యేందుకు వారిని నాన్ బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కులలో పంపిస్తున్నారు. మరోవైపు రూ. 8400 కోట్లతో ప్రధాని కోసం ఖరీదైన విమానం కొనుగోలు చేశారు. ఇది న్యాయమేనా?"