తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వరద బాధితులకు సహాయ సామగ్రి అందించండి' - కేరళ

కేరళలో వరదలతో అతలాకుతలమైన వయనాడ్​ ప్రజలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ సాయం అందించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. తాగునీరు, దుప్పట్లు, దుస్తులు వంటి నిత్యవసరాలు అందించాలని కోరారు. మల్లప్పురం జిల్లాలోని సామాగ్రి సేకరణ కేంద్రానికి దాతలు సహాయ సామగ్రిని పంపాలని విజ్ఞప్తి చేశారు.

'వరద బాధితులకు సహాయ సామగ్రి అందించండి'

By

Published : Aug 12, 2019, 1:07 PM IST

Updated : Sep 26, 2019, 5:59 PM IST

కైతపోయిల్​ శిబిరంలో రాహుల్​ గాంధీ
వరద ప్రభావానికి గురైన తన సొంత నియోజకవర్గం వయనాడ్​ ప్రజలకు ప్రతిఒక్కరూ సహాయ సామగ్రిని అందించాలని కోరారు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ. ప్రస్తుతం వయనాడ్​లోని ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

భారీ వర్షాల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని అన్నారు రాహుల్​. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి అవసరమైన సహాయ సామగ్రి అందించాలని తన ఫేస్​ బుక్​ పేజీలో కోరారు​. నిత్యావసర సరుకులు, తాగునీరు, దుప్పట్లు, దుస్తులు, పిల్లలకు అవసరమైన శానిటరీ నాప్​కిన్స్​ వంటివి అందించాలని కోరారు. మల్లప్పురం జిల్లాలోని సేకరణ కేంద్రానికి దాతలు సహాయ సామగ్రిని పంపాలని విజ్ఞప్తి చేశారు.

బాధితులకు నిత్యవసరాల పంపిణీ

వయనాడ్​ కైతపోయిల్​ శిబిరంలోని బాధితులను సోమవారం పరామర్శించారు రాహుల్ గాంధీ​. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున సహాయ సామగ్రిని పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులకు ఫోన్​ చేసి తగిన సహాయం అందించాలని కోరినట్లు తెలిపారు.

" వయనాడ్​ పార్లమెంట్​ సభ్యునిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్​ చేసి త్వరితగతిన సహాయం అందించాలని కోరాను. ప్రధానమంత్రికి కూడా ఫోన్​ చేసి ఇక్కడి పరిస్థితులను వివరించాను. కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని తెలిపాను. ఈ విపత్కర పరిస్థితుల్లో మేమంతా మీకు మద్దతుగా నిలుస్తాం. కాంగ్రెస్​ పార్టీ మాత్రమే కాదు వయనాడ్​లోని ప్రతిఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలి. వరద సహాయక చర్యల్లో ముందుండాలని కాంగ్రెస్​ కార్యకర్తలను కోరుతున్నాను. "

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నాయకులు.

ఇదీ చూడండి: 'వారి బాధ చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది'

Last Updated : Sep 26, 2019, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details