కాంగ్రెస్ న్యాయ్ హామీకి మూలం మోదీ: రాహుల్ 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నరేంద్రమోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.హరియాణా కర్నాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్.
గత ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన "అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు జమ హామీ" నుంచే 'కనీస ఆదాయ హామీ' పథకం ఆలోచన వచ్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మోదీ 15 లక్షలని అబద్ధాలు చెప్పారని , కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుపేదల ఖాతాల్లో సంవత్సరానికి 72 వేలు జమ చేసి తీరుతుందని రాహుల్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ కనీస ఆదాయ హామీ పథకం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పథకం ప్రకటించగానే ప్రధాని కంగారు పడ్డారని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి :ఈసారి రెట్టింపు ఉత్తేజంతో దూసుకెళ్తాం : రాహుల్
ప్రధాని ధనికులను మాత్రమే ఆదుకుంటారని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఆయనకు కనపడరని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికలు భాజపా-ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ భావజాలాల మధ్య జరిగే పోరుగా రాహుల్ అభివర్ణించారు.