తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రభుత్వ వైఖరితో చెల్లించక తప్పదు భారీ మూల్యం'

చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ప్రభుత్వం తీరుతో భారత్​ భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్వీట్​ చేశారు.

Rahul again targets govt over border standoff
'ప్రభుత్వ వైఖరితో చెల్లించక తప్పదు భారీ మూల్యం'

By

Published : Jul 18, 2020, 9:44 PM IST

కేంద్ర ప్రభుత్వమే లక్ష్యంగా మరోమారు విమర్శనాస్త్రాలను సంధించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో ప్రభుత్వం వైఖరిని తప్పుబడుతూ.. భారత్​ భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్వీట్​ చేశారు.

"చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది. కానీ భారత ప్రభుత్వం మాత్రం చంబెర్లిన్(రాజ భవనంలో గృహ బాధ్యతలు నిర్వహించే అధికారి)​లా ప్రవర్తిస్తోంది. ప్రభుత్వ వైఖరితో భారత్​ భారీ మూల్యం చెల్లించక తప్పదు."

--- రాహుల్​ గాంధీ, సీనియర్​ కాంగ్రెస్​ నేత.

లద్ధాఖ్​లో రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పర్యటనకు సంబంధించిన వార్తను తన ట్వీట్​కు జత చేశారు గాంధీ.

గత కొంత కాలంగా చైనా-భారత్​ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరు దేశాల అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ పూర్తి వ్యవహారంలో భారత ప్రభుత్వం విఫలమైందంటూ రాహుల్​ గాంధీ అనేక మార్లు విమర్శించారు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details