తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజకీయ తూటాలు - GANDHI

అమేఠీలో ప్రధాని శంకుస్థాపన చేసిన ఆయుధ కర్మాగారం... అధికార, విపక్షాల మధ్య ట్వీట్ల తుటాలు పేలుస్తోంది. మోదీ అమేఠీ వేదికగా మరోసారి అసత్య ప్రచారం చేశారని రాహుల్ ఆరోపించారు. అమేఠీ అభివృద్ధిని చూసి రాహుల్​ భయపడుతున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్వీట్​ చేశారు.

RAHUL

By

Published : Mar 4, 2019, 5:33 PM IST

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేఠీలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఏకే-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఇక నుంచి అమేఠీ ఓ కుటుంబ పాలనకు నిదర్శనంగా కాకుండా ఉగ్రవాదులను మట్టుబెట్టే రైఫిళ్ల తయారీ కేంద్రంగా గుర్తింపు పొందుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.

మోదీ విమర్శలపై రాహుల్​ ట్విట్టర్​లో స్పందించారు.

‘‘నేను 2010లో అమేఠీ ఆర్డినెన్స్‌ కర్మాగారానికి శంకుస్థాపన చేశాను. కొన్నేళ్లుగా అక్కడ ఆయుధాలు ఉత్పత్తి అవుతున్నాయి. మీరు(మోదీ) నిన్న అమేఠీకి వెళ్లి మరోసారి అబద్ధాలు చెప్పారు’’
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర మంత్రి స్మతి ఇరానీ ట్విట్టర్​ వేదికగా ఖండించారు.

"అమేఠీ అభివృద్ధిని చూసి మీరు(రాహుల్ గాంధీ) భయపడుతున్నారు. నిన్నటి కార్యక్రమాన్ని సరిగా గమనించలేదనుకుంటా. అమేఠీ కోర్వాలో ప్రధాని శంకుస్థాపన చేసింది రష్యా-భారత్ మధ్య ప్రారంభమైన ఉమ్మడి ప్రాజెక్టు. అక్కడ ఏకే-203 రైఫిళ్లు తయారవుతాయి."
- స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి

ABOUT THE AUTHOR

...view details