తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వయనాడ్​ నుంచి రాహుల్​... సంబరాల్లో కార్యకర్తలు - Rahul Gandhi

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ వయనాడ్​ నుంచి పోటీ చేస్తారన్న ప్రకటనతో కేరళలోని ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలన్నింటిలోనూ స్వీట్లు పంచుతూ, బాణసంచా పేలుస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు

By

Published : Mar 31, 2019, 9:17 PM IST

కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు
కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ పోటీ చేయనుండటంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. వయనాడ్​లోని పార్టీ జిల్లా కార్యాలయంలో స్వీట్లు పంచుతూ, బాణసంచా పేలుస్తూ కోలాహల వాతావరణాన్ని సృష్టించారు. రాహుల్​కు అనుకూలంగా నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాంగ్రెస్​ కార్యాలయాల్లోనూ సంబరాలు జరుపుకున్నారు కార్యకర్తలు.

రాహుల్​ వయనాడ్​ లోక్​సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారని తెలిసినా... పార్టీ నేతలు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూశారు. రాహుల్​ అమేఠీతో పాటు వయనాడ్​ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్​ పార్టీ ప్రకటించగానే... సంబరాలు మొదలెట్టారు. రాహుల్​ ఫోటోలు, పార్టీ జెండాలను ప్రదర్శిస్తూ వయనాడ్​ వీధులన్నీ చుట్టేశారు పార్టీ కార్యకర్తలు.

వయనాడ్​ లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థి 'ఎం.ఐ షానవాస్'​ గతంలో రెండుసార్లు(2009,2014) విజయం సాధించారు. గతేడాది నవంబర్​లో ఆయన మరణించారు.

వయనాడ్​ లోక్​సభ అభ్యర్థిగా రీరీ సునీర్​ను ప్రకటించింది వామపక్ష కూటమి. భాజపా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

ABOUT THE AUTHOR

...view details