తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ఆ పత్రాలు కేంద్రం విడుదల చేసినవే"

రఫేల్​ తీర్పు రివ్యూ పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరిగింది. కేంద్రం అనుమతి లేకుండా రఫేల్​ ఒప్పంద పత్రాలను న్యాయస్థానంలో ప్రవేశపెట్టరాదని అటార్నీ జనరల్​ వేణుగోపాల్​ వాదించారు. సమీక్ష పిటిషన్లలోని పత్రాలు ప్రభుత్వం గతంలో విడుదల చేసినవేనని పిటిషనర్ల ​తరఫు న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ పేర్కొన్నారు.

By

Published : Mar 14, 2019, 5:48 PM IST

Updated : Mar 14, 2019, 7:58 PM IST

సుప్రీం

ఆ పత్రాలు కేంద్రం విడుదల చేసినవే

ప్రభుత్వం అనుమతి లేకుండా రఫేల్​​ ఒప్పందం పత్రాలను కోర్టులో ప్రవేశపెట్టే హక్కులేదని ఎవరికీ సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. అందుకు సంబంధిత విభాగం అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.

సాక్ష్యాధారాల చట్టం సెక్షన్ ​123, సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం రఫేల్​ ఒప్పంద పత్రాలు కోర్టుకు సమర్పించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్​ వేణుగోపాల్​ ధర్మాసనానికి చెప్పారు. దీన్ని కారణంగా చూపిస్తూ లీకైన ఒప్పంద పత్రాలను రివ్యూ పిటిషన్​ నుంచి తొలగించాలని కోరారు.

పత్రాలు ఇది వరకే విడుదల చేసింది

అటార్నీ జనరల్​ లీకైనట్లుగా చెప్పుతున్న పత్రాలు కేంద్రం ఇదివరకే విడుదల చేసినవేనని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పారు. "నిఘా వర్గాలు అందించే కీలక సమాచారం మినహా ఎటువంటి సమాచారాన్నైనా స.హ.చట్టం ద్వారా పొందవచ్చు.

రఫేల్​ యుద్ధ విమానాల ధరలను, ఇతర కీలక నివేదికలను ఇప్పటికే కాగ్ ప్రకటించింది. రఫేల్​.. ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం కాదు. ఫ్రాన్స్​ ప్రభుత్వం నుంచి ఒప్పందంపై ఎటువంటి అధికార హామీ లేదు. కావున పత్రాలు కోర్టులో ప్రవేశ పెట్టవచ్చు" అని ప్రశాంత్​ భూషణ్​ న్యాయస్థానానికి విన్నవించారు.

ఇరు వర్గాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రజన్​ గొగొయ్ నేతృత్వంలోని ​ ధర్మాసనం తీర్పుని వాయిదా వేసింది.

Last Updated : Mar 14, 2019, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details