రఫేల్ యుద్ధ విమానంలో సాంకేతిక అంశాలను తెలుసుకునేందుకు భారత వాయుసేన వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ భదూరియా ప్రయాణించారు. ఫ్రాన్స్‌లోని మాంట్ ది మార్సన్ వైమానిక స్థావరంలో అధునాతన రఫేల్‌ను నడిపించారు. ఈ యుద్ధ విమానాన్ని అద్భుతమైన సాంకేతికతతో నిర్మించారని ప్రశంసించారు.
"రఫేల్‌తో మన వాయుసేన సామర్థ్యం మరింత పెరుగుతుంది. మన నిర్వహణ సామర్థ్యం కూడా మెరుగవుతుంది. రఫేల్‌లో పొందుపరిచిన సాంకేతికత, ఆయుధాల సాయంతో మనం కొత్తగా ఎన్నో చేయగలం. వాయుసేనకు రఫేల్ మరో గేమ్ ఛేంజర్. ప్రణాళికలు, రక్షణ అంశాలు, భవిష్యత్తులో యుద్ధసమయాల్లో ఎంతో కీలకం కానుంది."