రఫేల్ ఒప్పందంలో ప్రధాని అవినీతికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు చెప్పిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. సుప్రీం వ్యాఖ్యలను వక్రీకరించి చెప్పి రాహుల్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తర్వులను పూర్తిగా చదవడం కూడా రాహల్‌కు రాదని అన్నారు నిర్మల. రఫేల్ ఒప్పందంపై ప్రజలను తరచూ రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
రఫేల్‌పై రివ్యూ కోసం పిటిషనర్లు పొందుపరిచిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంపై మాత్రమే కోర్టు అదేశాలున్నాయని వివరణ ఇచ్చారు నిర్మల.
కుటుంబ సభ్యుల సమక్షంలో అమేఠీలో నామపత్రాలు దాఖలు చేసిన రాహుల్‌ను... అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌తో పోల్చారు నిర్మల.
మీడియాతో మాట్లాడుతున్న నిర్మల " ముందు సుప్రీంకోర్టు ఉత్తర్వులను చదవండి. ఆ రెండు మాటలు ఎక్కడున్నాయో చూపించండి. కోర్టు ఉత్తర్వుల్లో ఆ వ్యాఖ్యలు ఎక్కడున్నాయి. ఒకరు ఇంకొకరికి రూ.30వేల కోట్లు ఇచ్చారని కోర్టు అంగీకరించిందన్నారు. ఎక్కడ అంగీకరించింది. తీర్పులో కోర్టు చెప్పని అంశాలను వక్రీకరించి చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తి ప్రధాన మంత్రిని చర్చకు రమ్మంటున్నారా. అబద్ధాలు చెప్పడం మానెయ్. తీర్పు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కానేకాదు. ఇప్పుడు అసలు వాస్తవాలేంటో తెలుస్తాయి. కాంగ్రెస్‌కు ముఖం చూపించుకోలేని పరిస్థితి వస్తుంది. "
-నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి
ఇదీ చూడండి: 'మోదీ.. రఫేల్ విచారణ ఎదుర్కోక తప్పదు'