తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ బిల్లా అరెస్టు

పంజాబ్​ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆయుధాల స్మగ్లింగ్​లో ఆరితేరిన కరుడుగట్టిన గ్యాంగ్​స్టర్​ బల్జీందర్​ సింగ్​ అలియాస్​ బిల్లా సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జర్మనీ, పాకిస్థాన్​లలో ఉన్న ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు బిల్లా అంగీకరించాడు.

Punjab police nab gangster with pro-Khalistan links, recover huge chache of arms
కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ బిల్లా అరెస్టు

By

Published : May 9, 2020, 7:18 AM IST

ఆయుధాల స్మగ్లింగ్‌లో ఆరితేరిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ బల్జీందర్‌ సింగ్‌ అలియాస్‌ బిల్లా మండియాలా, అతడి ముఠాలోని మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కపుర్తలా జిల్లాలోని సుల్తాన్‌పుర్‌ లోఢి ప్రాంతంలో వీరిని అరెస్టు చేసి భారీగా.. అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేకున్నట్టు డీజీపీ దిన్‌కర్‌ గుప్త చెప్పారు.

బిల్లా.. పాకిస్థాన్‌ నుంచి అత్యాధునిక విదేశీ మారణాయుధాలను అక్రమంగా తీసుకురావడాన్నే వృత్తిగా పెట్టుకున్నాడు. ఖలిస్థాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌, ఖలిస్థాన్‌ జిందాబాద్‌ ఫ్రంట్‌ల అధినేతలతో అతడికి సంబంధాలు ఉన్నాయి. హత్యలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించి 18 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో రెండు డ్రమ్‌ మెషీన్‌ గన్లు, జర్మనీలో తయారైన మూడు ఎస్‌ఐజీ సౌవెర్‌ పిస్టళ్లు ఉన్నాయి. ఇలాంటి పిస్టళ్లను అమెరికా సీక్రెట్‌ సర్వీసు ఏజెంట్లు ఉపయోగిస్తారు. 3 లక్షలకు పైగా ఆస్ట్రేలియన్‌ డాలర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. జర్మనీ, పాకిస్థాన్‌లలో ఉన్న ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు బిల్లా అంగీకరించాడు.

ABOUT THE AUTHOR

...view details