వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్రమోదీకి పంజాబ్ రాష్ట్రం మరో అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ పేర్కొంది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు బిల్లులను పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ.. కేంద్రానికి సూచనలు చేశారు.
"రాజ్యాంగానికి విరుద్ధంగా సెప్టెంబర్‌లో వ్యవసాయ చట్టాలను భాజపా ప్రభుత్వం తీసుకొచ్చింది. పంజాబ్ ఇప్పుడు వారికి మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటికైనా రైతుల బాధను అర్థం చేసుకుని సెప్టెంబరులో చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుకోవాలి. ఇందుకు పంజాబ్‌కు మోదీతోపాటు భాజపా కూడా కృతజ్ఞతలు తెలపాలి."