తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన యువతులు - రాష్ట్రపతి

ఇద్దరు పంజాబీ యువతులు రక్తంతో రాష్ట్రపతికి లేఖ రాశారు. తమపై తప్పుడు కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమను ఆదుకోవాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు. న్యాయం జరగకపోతే కుటుంబం మొత్తానికి యూథనేజియాకు అనుమతినివ్వాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన యువతులు

By

Published : Jul 7, 2019, 11:10 AM IST

Updated : Jul 7, 2019, 12:22 PM IST

రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన యువతులు

పంజాబ్​కు చెందిన ఇద్దరు​ యువతులు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు రక్తంతో లేఖ రాసిన ఘటన కలకలం రేపుతోంది. తమపై కొందరు తప్పుడు కేసులు నమోదు చేసి హింసిస్తున్నారని లేఖలో పేర్కొన్న యువతులు... సహాయం చేయాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు.

తప్పుడు కేసులతో చిత్రహింసలు...

నిషా, అమన్​ కౌర్​... పంజాబ్​లోని మొగా నగరంలో నివసిస్తున్నారు. తమపై కొందరు కావాలనే పావురాల రేసుల నిర్వహణ, మోసం వంటి అభియోగాలపై కేసులు నమోదు చేశారని తెలిపారు. ఎన్నో రోజులుగా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని... పోలీసులను సంప్రదించినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సహాయం కోసం రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసినట్టు వివరించారు.

ఈ ఘటనపై స్పందించిన మొగా డీఎస్​పీ... యువతులు పోలీసులపై చేసిన ఆరోపణలను ఖండించారు.

"వీరిద్దరు ఫైనాన్స్ పని​ చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే చెక్​ లభించిందని చెప్పారు. కానీ ఫిర్యాదు చేసిన వారు మాత్రం మరోలా చెబుతున్నారు. తమ కొడుకును విదేశాలకు పంపుతామని చెప్పి డబ్బు తీసుకున్నారంటున్నారు. దీనిపై విచారణ చేపట్టాం. అమ్మాయిలు రాష్ట్రపతికి లేఖ రాశారని విన్నా. కానీ నాకు ఎలాంటి లిఖిత పూర్వక సమాచారం అందలేదు."
--- కుల్జిందర్​ సింగ్​, డీఎస్​పీ.

న్యాయం జరగకపోతే...

ఎన్నో రోజులుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నామని యువతులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం దక్కకపోతే కుటుంబం మొత్తానికి యూథనేజియాకు అనుమతినివ్వాలని డిమాండ్​ చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాసినట్టు వెల్లడించారు.

జీవితం చివరాంకంలో ఉన్న రోగుల కారుణ్య మరణాలకు అనుమతిస్తూ 2018 మార్చి 9న సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వైద్యంలేని రోగాల బారిన పడిన వారు, ఎప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నవారు చనిపోయేందుకు 'యూథనేజియా'కు చట్టబద్ధత కల్పించింది.

ఇదీ చూడండి:- నిష్క్రమణ తర్వాత ఐసీసీ పద్ధతులపై పాక్​ కొత్త పాట

Last Updated : Jul 7, 2019, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details