జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా లస్సిపొరాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా సిబ్బంది, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి మూడు ఏకే సిరీస్ రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
పుల్వామాలో మరో నలుగురు ఉగ్రవాదులు హతం - KASHMIR
జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు.
పుల్వామాలో ఎన్కౌంటర్
ఉగ్రవాదులున్నారనే సమాచారంతో లస్సిపొరాలో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ముందే పసిగట్టిన ముష్కరులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. సమర్థంగా తిప్పికొట్టిన సైన్యం.. నలుగురిని మట్టుబెట్టింది. వీరిని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా అనుమానిస్తున్నారు అధికారులు.
Last Updated : Jun 7, 2019, 12:28 PM IST