తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రచారానికి ప్రియాంక 'గంగాయాత్ర' - ప్రియాంక గాంధీ

ఈ నెల 18వ తేదీ నుంచి ఉత్తర్​ప్రదేశ్​లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం చేయనున్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. నేటి నుంచి ప్రచారం ప్రారంభిస్తారని ముందుగా చెప్పినా, కొన్ని కారణాల వల్ల వాయిదా వేసినట్టు కాంగ్రెస్​ ప్రకటించింది.

ప్రియాంక

By

Published : Mar 15, 2019, 5:59 PM IST

కీలక రాష్ట్రమైన ఉత్తర్​ప్రదేశ్​ నుంచి కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆమె ప్రచారం చేయనున్నారు. గంగానదీ తీరాన ఉన్న తూర్పు ఉత్తర్​ప్రదేశ్​, ప్రయాగ్​రాజ్​, వారణాసిల గుండా ఈ ప్రచార కార్యక్రమం సాగనుంది. అయితే ఇది పాదయాత్ర కాదు, బస్సు యాత్ర కాదు.. బోటు యాత్ర.

నేడు ప్రారంభం కావాలి కానీ..

షెడ్యూల్​ ప్రకారం నేటి నుంచే ప్రచార కార్యక్రమం జరగాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఇది 18వ తేదీకి వాయిదా పడిందని కాంగ్రెస్​ ప్రకటించింది.

ప్రయాగ్​రాజ్​ నుంచి వారణాసి వరకు పర్యటించేందుకు 18 నుంచి 20వ తేదీవరకు కాంగ్రెస్​కు అనుమతి లభించినట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన లేఖలో ఉంది.

భారీ బోటు యాత్ర

సుమారు బోటులో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు ప్రియాంక. ప్రతి రేవులోనూ ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్​ నాయకులు. మారుమూల నదీ తీర ప్రాంతంలోని ప్రజల సమస్యలు వినేందుకే ప్రియాంక గాంధీ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు హస్తం పార్టీ పేర్కొంది.

స్వతంత్ర భారత మొదటి ప్రధాని జనహర్​లాల్​ నెహ్రూ జన్మించిన ప్రయాగ్​రాజ్​ నుంచి ప్రియాంక ప్రచారం ప్రారంభించనున్నారు.

ఆనంద్​ భవన్​ సందర్శనతో ప్రారంభం

అలహాబాద్​లోని చారిత్రక కట్టడం ఆనంద్​ భవన్​ను సందర్శించనున్నారు ప్రియాంకా గాంధీ. ఇక్కడ జవహర్​ లాల్​ నెహ్రూ, ఆయన తండ్రి మోతీలాల్​ నెహ్రు నివాసముండే వారు. ప్రస్తుతం ఇది మ్యూజియంగా ఉంది.

ఆలయాల్లో పూజలు

పర్యటనలో భాగంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ్​ ఆలయం, మీర్జాపూర్​లోని వింద్యావాసినీ ఆలయాలను దర్శించనున్నారు ప్రియాంకా గాంధీ. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details