తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారణాసిలో నేడు ప్రియాంక గాంధీ రోడ్​ షో - వారణాసి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి లోక్​సభ స్థానంలో నేడు కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రోడ్​ షో నిర్వహించనున్నారు. బనారస్​ హిందూ విశ్వవిద్యాలయం నుంచి దశాశ్వ్​మేధ్​ ఘాట్​ వరకు ర్యాలీ సాగనుంది.

వారణాసిలో నేడు ప్రియాంక గాంధీ రోడ్​ షో

By

Published : May 15, 2019, 5:02 AM IST

Updated : May 15, 2019, 8:04 AM IST

వారణాసిలో నేడు ప్రియాంక గాంధీ రోడ్​ షో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారంరోడ్​షో నిర్వహించనున్నారు. ప్రియాంక రోడ్​ షోకు విస్తృత ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్​ పార్టీ నేతలు.

ప్రధాని రోడ్​షోలాగే..

ఏప్రిల్​ 25న వారణాసిలో నామినేషన్​ వేసేందుకు ప్రధాని మోదీ ఎక్కడి నుంచి రోడ్​ షో ప్రారంభించారో... అక్కడి నుంచే బుధవారం ప్రియాంక రోడ్​ షో మొదలవుతుంది. బనారస్​ హిందూ విశ్వవిద్యాలయం సమీపంలోని మదన్​ మోహన్​ మాలవీయ విగ్రహం నుంచి రోడ్​ షో ఆరంభమవనుంది. దశాశ్వ్​మేధ్​ ఘాట్ వద్ద​ ర్యాలీ ముగుస్తుంది. ప్రధాని రోడ్​షో కూడా ఇదే ప్రాంతంలో ముగిసింది.

ఆలయాల్లో పూజలు..

రోడ్​ షో అనంతరం నగరంలోని కాశీ విశ్వనాథ ఆలయం, కొత్వాలి ప్రాంతంలోని కాల భైరవ ఆలయాల్లో ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ప్రధాని మోదీపై పోటీగా వారణాసి నుంచి ప్రియాంక గాంధీ బరిలో నిలుస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఉత్కంఠకు తెరదించుతూ వారణాసి స్థానంలో అజయ్​ రాయ్​ను బరిలో దింపింది కాంగ్రెస్​ పార్టీ.

దేశంలో సాధారణ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఏడో విడతలో భాగంగా వారణాసి లోక్​సభ స్థానానికి మే 19న ఎన్నికలు జరగనున్నాయి.

Last Updated : May 15, 2019, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details