తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ తొలిసారి ట్వీట్ చేశారు. మహాత్మాగాంధీ సబర్మతీ ఆశ్రమాన్ని గుర్తుచేస్తూ ప్రియాంక రెండు వరుస ట్వీట్లు చేశారు.
ప్రియాంక తొలి ట్వీట్లో 'జాతిపిత'
తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ తొలిసారి ట్వీట్ చేశారు. హింసకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు.
"సబర్మతి ఆశ్రమం రూపంలో నిజం ఎప్పటికీ బతికే ఉంటుందని" ట్వీట్ చేసి మరోసారి జాతిపితను స్మరించుకున్నారు రాహుల్‌గాంధీ సోదరి. మహాత్మా గాంధీ పేరును ట్యాగ్ చేస్తూ "నేను హింసను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే అది చేసేటప్పుడు బాగా అనిపించినా, దాని వల్ల కలిగే మంచి తాత్కాలికమే. హింసతో వచ్చే చెడు ఎప్పటికీ అలాగే ఉంటుంది." అని రాశారు.
ఫిబ్రవరి 11న ట్విట్టర్ ఖాతా తెరిచిన ప్రియాంక నెలరోజులైనా ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ట్విట్టర్ ఖాతా తెరిచిన పది గంటల్లోనే లక్ష మందికి పైగా ఫోలోవర్లు ప్రియాంకను అనుసరించారు. ప్రస్తుతం 2,33,000 వేల మంది ఫాలో అవుతున్నారు