తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. నాకొద్దీ భద్రత' - UP

ఉత్తరప్రదేశ్​లో పర్యటించే సమయంలో కనిష్ఠ స్థాయిలోనే భద్రత కల్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్​ను కోరారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. భారీగా భద్రత కల్పిస్తే ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

'ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. నాకొద్దీ భద్రత'

By

Published : Jul 19, 2019, 12:22 PM IST

ఉత్తరప్రదేశ్​లో పర్యటించినప్పుడు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ. ఈ స్థాయిలో భద్రత తనకు అవసరం లేదని ఉత్తరప్రదేశ్​ సీఎం ఆదిత్యనాథ్​కు లేఖ ద్వారా తెలిపారు ప్రియాంక. భద్రత ఎక్కువగా ఉంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు.

"రాష్ట్రంలో పర్యటించినప్పుడు భారీ భద్రత ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు. అయితే ఇది ప్రజలను ఎంతో ఇబ్బందులకు గురిచేస్తోంది. నేను ప్రజలకు సేవకురాలిని. నా వల్ల వాళ్లు ఇబ్బంది పడకూడదు."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత.

జూన్​లో యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీతో కలిసి ప్రియాంక రాష్ట్రానికి వచ్చినప్పుడు 22 వాహనాలతో కాన్వాయ్​ ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై ప్రియాంక స్పందించారు.

ఇదీ చూడండి:- ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో మాస్టర్ బ్లాస్టర్​

ABOUT THE AUTHOR

...view details