తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎగ్జిట్​ పోల్స్​తో నిరాశ పడకండి: ప్రియాంక - ఫలితాలు

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు చూసి నిరాశ చెందవద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పుకార్లు నమ్మొద్దని తెలిపారు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని భరోసానిచ్చారు.

కార్యకర్తలకు ప్రియాంక ఆడియో సందేశం

By

Published : May 21, 2019, 9:15 AM IST

Updated : May 21, 2019, 9:29 AM IST

కార్యకర్తలకు ప్రియాంక గాంధీ సందేశం

ఇప్పడు దేశం మొత్తం ఎగ్జిట్​ పోల్సే​ హాట్​ టాపిక్​. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం వెలువడిన అన్ని ఎగ్జిట్​ పోల్స్​... భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ రెండోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్​ పార్టీకి ఈ సారీ నిరాశే మిగులుతుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు ఆడియో ద్వారా సందేశం పంపారు కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.

ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలను చూసి కార్యకర్తలు మనస్తాపానికి గురి కావాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు ప్రియాంక. పుకార్లు నమ్మొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల వేళ నిర్దేశించిన స్ట్రాంగ్​రూంలు. లెక్కింపు​ కేంద్రాల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

"ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు, పుకార్లతో నిరాశ పడకండి. మీ స్ఫూర్తిని దెబ్బతీయడానికే వాటిని రూపొందించారు. వీటన్నింటిని ఎదుర్కొని అప్రమత్తంగా ఉండటమే ముఖ్యం. లెక్కింపు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి. మీ, మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతున్నా. "
--- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

ఇదీ చూడండి: ఒకే కాన్పులో అరడజను​ మంది పిల్లలు

Last Updated : May 21, 2019, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details