తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తప్పు చేసిన పిల్లాడిలా మోదీ ప్రవర్తిస్తున్నారు' - ఎన్నికల ప్రచారం

దిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

మోదీ..తప్పుచేసిన పిల్లాడిలా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక

By

Published : May 9, 2019, 5:25 AM IST

Updated : May 9, 2019, 8:07 AM IST

తప్పు చేసిన పిల్లాడిలా మోదీ ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక

తప్పు చేసి శిక్ష పడకుండా ఉపాధ్యాయుల నుంచి తప్పించుకునే పిల్లాడిలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. మోదీ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

దిల్లీలో జరిగిన రెండు రోడ్​షోల్లో ప్రియాంక పాల్గొన్నారు. ఉత్తర దిల్లీలో జరిగిన రోడ్​షోలో మాజీ సీఎం, పార్టీ అభ్యర్థి షీలా దీక్షిత్​ పాల్గొన్నారు. దక్షిణ దిల్లీలో కాంగ్రెస్​ అభ్యర్థి విజేందర్​ సింగ్​తో కలిసి ప్రియాంక ప్రచారం నిర్వహించారు.

"దిల్లీకి చెందిన మహిళగా, నేను మీకు (మోదీ) సవాల్​ చేస్తున్నాను. నోట్ల రద్దు, జీఎస్టీ, మహిళల భద్రత, తప్పుడు వాగ్దానాలే ప్రధాన అంశాలుగా ఎన్నికల్లో పోటీకి రండి" - ప్రియాంకగాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీని మోదీ విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ.

"మాజీ ప్రధానులపై తప్పులను నెట్టివేయాలని మోదీ చూస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, ఉపాధ్యాయుడి శిక్ష నుంచి తప్పించుకోవడానికి తప్పు చేసిన విద్యార్థులు చేసే పనిలా ఉంది. - ప్రియాంకగాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి: ఒడిశా: పునరుద్ధరణ పనుల్లో పుంజుకున్న వేగం

Last Updated : May 9, 2019, 8:07 AM IST

ABOUT THE AUTHOR

...view details