పౌరసత్వ చట్టంపై వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టయిన నిరసనకారుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంక గాంధీ వాహనాన్ని లఖ్నవూలో మార్గమధ్యలో అడ్డుకున్నారు యూపీ పోలీసులు. ఆమె వాహనాన్ని ముందుకు సాగేందుకు నిరాకరించారు. పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య కాసేపు వాగ్వివాదం తలెత్తింది.
వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. కాలినడకన ప్రియాంక! - up police latest news
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రయాణిస్తోన్న వాహనాన్ని మార్గమధ్యలో అడ్డుకున్నారు యూపీ పోలీసులు. పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల్లో అరెస్టయిన నిరసనకారుడి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తున్న ఆమెను మధ్యలోనే నిలిపివేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ప్రియాంక... వాహనం దిగి నడిచి వెళ్లారు.
ప్రియాంకను మార్గం మధ్యలో అడ్డుకున్న పోలీసులు
యూపీ పోలీసుల తీరుపై ప్రియాంక అసహనం వ్యక్తం చేశారు. వాహనాన్ని రోడ్డుపై నిలిపివేయడం సరికాదన్నారు. అనంతరం కారు దిగి కాలినడకన ముందుకు సాగారు.
ఇదీ చూడండి: అలా అయితే పాకిస్థాన్ వెళ్లిపోండి: పోలీస్ ఉన్నతాధికారి