తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టన్నెల్​ ప్రారంభానికి ముందు అక్కడి సిబ్బందికి కరోనా - సొరంగ మార్గం

ప్రపంచంలోనే పొడవైన అటల్​ టన్నెల్ ప్రారంభానికి ముందు అక్కడి సిబ్బందికి కరోనా సోకడం కలవరపెడుతోంది. సొరంగ మార్గం ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేసేందుకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 17 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ టన్నెల్​ను ప్రధానమంత్రి.. శనివారం రోహ్​తంగ్​లో ప్రారంభించనున్నారు.

Prior to PM's inauguration of Atal tunnel : 17 employees tested COVID-19 positive
అటల్​ టన్నెల్​ ప్రారంభానికి ముందు అక్కడి సిబ్బందికి కరోనా

By

Published : Oct 2, 2020, 8:45 AM IST

సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే పొడవైన రహదారి టన్నెల్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శనివారమే రోహ్​తంగ్​లో ఈ టన్నెల్‌ను ప్రారంభించనున్నారు.

అయితే.. సొరంగ మార్గం ప్రారంభానికి ముందు అక్కడి సిబ్బందికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. టన్నెల్​ ప్రారంభోత్సవం ఏర్పాట్లు చేసేందుకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 17 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఇందులో పోలీసులు, పర్యటక శాఖ ఉద్యోగులు, పీఎంఓ కార్యాలయ డ్రైవర్లు ఉన్నారు. ప్రొటోకాల్​ ప్రకారం ప్రధాని కార్యక్రమంలో పాల్గొనే ప్రతిఒక్కరికీ కొవిడ్​ పరీక్షలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: మరో కీలక టన్నెల్​ నిర్మాణంపై కేంద్రం దృష్టి!

హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద సొరంగ మార్గమిది. ప్రారంభోత్సవం కోసం హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రారంభానంతరం.. బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. వ్యూహాత్మక ప్రయోజనాలున్న ఈ సొరంగంతో మనాలి, లేహ్‌ మధ్య దూరం 46 కిలోమీటర్లు తగ్గడంతో పాటు 4- 5 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. 9.02 కిలోమీటర్ల ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పేరు పెట్టారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనేలా, 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ సొరంగాన్ని నిర్మించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

ప్రధాని పర్యటనకు ముందురోజు శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మనాలిలో పర్యటించనున్నారు. మనాలి- లేహ్‌ మార్గంలో నిర్మించిన 3 కీలక వంతెనలను ఆయన ప్రారంభిస్తారు.

ABOUT THE AUTHOR

...view details