ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యకార్యదర్శిగా గత ఐదేళ్లుగా సేవలందిస్తున్న నృపేంద్ర మిశ్రా పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. మరో రెండు వారాల పాటు కొనసాగాలన్న ప్రధాని అభ్యర్థన మేరకు... గడువు ముగిసిన అనంతరం ఆయన బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. కేబినెట్ సెక్రటరీగా నేడు పదవి విరమణ పొందిన పీకే సిన్హాను ప్రధానమంత్రి కార్యాలయ ఓఎస్డీగా నియమించారు.
1967 బ్యాచ్‌కు చెందిన నృపేంద్రమిశ్రా ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. మిశ్రా భావిజీవితం ఆనందకరంగా సాగాలని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
"2014లో నేను దిల్లీకి కొత్తగా వచ్చినప్పుడు ఆయనే వివిధ అంశాలపై దిక్సూచీ అయ్యారు. ఆయన సూచనలు ఎంతో విలువైనవి... గత ఐదేళ్లుగా ఎంతో అంకిత భావంతో పనిచేసి... భారత అభివృద్ధిపై చెరగని ముద్రవేశారు. నూతన జీవితాన్ని ప్రారంభించనున్న మిశ్రాకు నా శుభాకాంక్షలు."