పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులు.. 21వ శతాబ్దపు భారత దేశానికి ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బిహార్‌లో రూ.14,258 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు దృశ్యమాధ్యమం ద్వారా ప్రధాని శంకుస్థాపన చేశారు.
అనంతరం బిహార్‌లోని 45,945 గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఘర్‌తక్ ఫైబర్ ప్రాజెక్టును ప్రారంభించారు.
మంచి జరిగింది...
కేంద్రం కొత్తగా తెచ్చిన సాగు బిల్లులు.. వ్యవసాయ మార్కెట్లకు వ్యతిరేకం కాదని మోదీ స్పష్టం చేశారు. ఇంతకు ముందున్న తరహాలోనే మార్కెట్లు కొనసాగుతాయని భరోసా ఇచ్చారు. ఈ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలలో రైతులు తమ పంట ఉత్పత్తులకు సంబంధించి మెరుగైన రేట్లను పొందుతున్నారని ప్రధాని వివరించారు.