తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భూటాన్​ నుంచి స్వదేశం చేరుకున్న ప్రధాని

రెండు రోజుల భూటాన్​ పర్యటన ముగించుకుని భారత్​ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, జలవిద్యుత్​ రంగంలో సహకారం తదితర అంశాలపై ఆ దేశాధినేతలతో చర్చలు జరిపారు. భారత్​ చేరుకున్న మోదీకి విదేశాంగ మంత్రి జైశంకర్​ స్వాగతం పలికారు.

భూటాన్​ పర్యటన ముగించుకుని భారత్​కు మోదీ

By

Published : Aug 18, 2019, 6:03 PM IST

Updated : Sep 27, 2019, 10:21 AM IST

పొరుగుదేశం భూటాన్​లో రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత్​లో అడుగుపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీ విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ స్వాగతం పలికారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, జల విద్యుత్​ రంగంలో సహకారం తదితర అంశాలపై ఆ దేశాధినేతలతో చర్చించారు మోదీ.

భూటాన్​కు కృతజ్ఞతలు...

భారత్​కు బయలుదేరే ముందు భూటాన్​ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని. ఇదొక గుర్తుండిపోయే పర్యటనగా అభివర్ణించారు. ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు.

పర్యటన సాగిందిలా...

శనివారం భూటాన్​ చేరుకున్నారు మోదీ. భూటాన్​ వాసులు మోదీకి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా రోడ్లకు ఇరువైపులా నిల్చుని ప్రధానికి ఘన స్వాగతం పలికారు. 2014 నుంచి ఇప్పటి వరకు భూటాన్​లో పర్యటించటం ఇది రెండోసారి. ఆ దేశ​ ప్రధాని లోటే షేరింగ్​తో విస్తృత చర్చలు జరిపారు. అంతరిక్ష పరిశోధన, వైమానిక, ఐటీ, విద్యుత్​, విద్యా రంగాల్లో ఇరు దేశాల మధ్య 10 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

అనంతరం భూటాన్​ రాజు జింగ్మే ఖేసర్​ నంగ్యేల్​ వాంగ్​చుక్​ను కలిశారు మోదీ. భారత్​-భూటాన్ భాగస్వామ్యం మరింత బలపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

రెండోరోజు.. భూటాన్​ రాజధాని థింపూలోని రాయల్​ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని. హిమాలయ దేశాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం దివంగత మూడవ డ్రూక్​ గయాల్పో గౌరవార్థం ఏర్పాటు చేసిన జాతీయ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు మోదీ.

Last Updated : Sep 27, 2019, 10:21 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details