తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ ప్రారంభం - ప్రధాని

నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఆధ్యక్షతన కరువు, నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో భద్రత తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ సమావేశం ప్రారంభం

By

Published : Jun 15, 2019, 4:09 PM IST

నీతి ఆయోగ్​ సమావేశం

దిల్లీలో రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశమైంది. నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత జరుగుతున్న అయిదవ, మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక జరుగుతున్న మొదటి పాలక మండలి భేటీ ఇది. ఈ సమావేశానికి దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

వ్యవసాయ రంగంలో సమస్యలు-నిర్మాణాత్మక మార్పులు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత, దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులు లక్ష్యాలుగా ఈ సమావేశం జరుగుతోంది. వర్షపు నీటి పరిరక్షణ, వెనకబడిన జిల్లాల అభివృద్ధి అంశాలపైనా చర్చ జరుగుతోంది.

బంగాల్​, పంజాబ్​, తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details