తెలంగాణ

telangana

ETV Bharat / bharat

9కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ: మోదీ

prime-minister
ప్రధాని మోదీ ప్రసంగం

By

Published : Jun 30, 2020, 3:52 PM IST

Updated : Jun 30, 2020, 4:44 PM IST

16:40 June 30

  • కరోనాతో పోరాటం చేస్తూ అన్‌లాక్ 2.0 లోకి ప్రవేశించాం: ప్రధాని
  • ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి: ప్రధాని
  • అందరూ ఆరోగ్యంగా ఉండండి.. రెండు గజాల భౌతిక దూరం పాటించండి: ప్రధాని
  • ఎలప్పుడూ మాస్కు ధరించండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించొద్దు: ప్రధాని
  • వర్షాకాలంలో వ్యవసాయ పనులు ముమ్మరమవుతాయి: ప్రధాని
  • ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది: ప్రధాని
  • జలుబు, జ్వరం వంటి రకరకాల వ్యాధులు చుట్టుముడతాయి: ప్రధాని
  • ఈ సమయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి: ప్రధాని
  • లాక్‌డౌన్‌తో లక్షలాదిమంది ప్రాణాలు కాపాడగలిగాం: ప్రధాని
  • కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది: ప్రధాని
  • నిబంధనలు పాటించని వారు తీరు మార్చుకోవాలి: ప్రధాని
  • కొవిడ్ నిబనంధనలు పాటించకపోతే జరిమానా విధించాలి: ప్రధాని
  • మాస్కు లేకుండా బయటకెళ్లిన ఒక దేశ ప్రధానికే రూ.13 వేలు జరిమానా విధించారు: ప్రధాని
  • అలాగే దేశంలో కూడా నిబంధనలు కఠినంగా అమలు చేయాలి: ప్రధాని
  • దేశంలో ఏ ఒక్కరూ చట్టానికి అతీతులు కాదు: ప్రధాని
  • దేశప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని
  • కంటైన్మెంట్ ప్రాంతాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలి
  • కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ఒకే తరహా అప్రమత్తతను ప్రదర్శించాలి: ప్రధాని
  • దేశంలో కొన్ని రాష్ట్రాలు అద్భుతమైన పనితీరు కనబరిచాయి: ప్రధాని
  • రాష్ట్రాలు ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి: ప్రధాని
  • ఒకే దేశం-ఒకే రేషన్ విధానం అమలు చేస్తున్నాం: ప్రధాని
  • పేదలకు ఉచిత ఆహారధాన్యాలు ఇస్తున్న ఘనత ఇద్దరి వల్లే సాధ్యమవుతోంది: ప్రధాని
  • ఒకరు రైతులు, మరొకరు పన్ను చెల్లింపుదారులు: ప్రధాని
  • పండగలను దృష్టిలో ఉంచుకుని పేదలకు ఉచితంగా సమకూర్చాం: ప్రధాని
  • కరోనాపై జాగ్రత్తలు తీసుకుంటూనే ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం చేయాలి: ప్రధాని
  • వివిధదేశాలతో పోల్చుకుంటే మనదేశంలో కరోనా మరణాలు తక్కువ: ప్రధాని
  • మన ఈ పోరాటం 130 కోట్ల భారతీయులను కాపాడుకోవడం కోసమే: ప్రధాని
     

16:17 June 30

దేశంలో కొన్ని రాష్ట్రాలు అద్భుత పనితీరును కనబరిచాయి

దేశంలో కొన్ని రాష్ట్రాలు అద్భుత పనితీరును కనబరిచాయి: మోదీ

రాష్ట్రాలు ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి: మోదీ

ఒకే దేశం-ఒకే రేషన్ విధానం అమలు చేస్తున్నాం: మోదీ

పేదలకు ఉచిత ఆహారధాన్యాలు ఇస్తున్న ఘనత ఇద్దరి వల్లే సాధ్యమవుతోంది: మోదీ

16:13 June 30

నవంబర్​ వరకు ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీ: మోదీ

  • దీపావళి వరకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన
  • 5 నెలలపాటు 80 కోట్లమందికి 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో కందిపప్పు పంపిణీ
  • బియ్యం, గోధుమలు, కందిపప్పు కోసం రూ.90 వేల కోట్లు ఖర్చవుతుంది
  • నవంబర్​ వరకు ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీ: మోదీ

16:10 June 30

లాక్‌డౌన్‌తో లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగాం

  • లాక్‌డౌన్‌తో లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగాం: ప్రధాని
  • కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది: ప్రధాని
  • నిబంధనలు పాటించని వారి తీరు మార్చాల్సిన అవసరం ఉంది: ప్రధాని
  • మాస్కు ధరించకుండా బయటకు వెళ్లినందుకు ఒక దేశ ప్రధానికే రూ.13 వేలు జరిమానా విధించారు: ప్రధాని
  • అలాగే దేశంలోకి కూడా నిబంధనలు కఠినంగా అమలు చేయాలి: ప్రధాని
  • దేశంలో ఏ ఒక్కరూ చట్టానికి అతీతులు కాదు: ప్రధాని
  • దేశప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని
  • దేశ ప్రజల సహకారం ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించేలా చేసింది: ప్రధాని
  • 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు నగదు జమ అయింది: ప్రధాని
  • ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం వేగంగా జరుగుతోంది: ప్రధాని

16:03 June 30

వానాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి: మోదీ

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. వానాకాలం వచ్చిందని, జలుబు, జ్వరం వంటి రకరకాల వ్యాధులు చుట్టుముడతాయని, ఈ సమయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాలు లాక్‌డౌన్‌ వల్ల వేలాది ప్రాణాలు కాపాడగలిగామన్నారు.

16:00 June 30

జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు.

15:47 June 30

జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. కరోనా సంక్షోభం, చైనాతో ఘర్షణల వేళ ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, స్వయం సమృద్ధి భారత్‌పై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దేశంలో రేపటినుంచి అన్‌లాక్ 2.0 ప్రారంభం కానుంది.

Last Updated : Jun 30, 2020, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details