సమస్యలు ఎదురైనప్పుడు భారత్వాటిని అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగుతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఏడాది ప్రారంభం నుంచి కరోనా సహా పలు ప్రకృతి విప్తతులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. మనసులో మాట (మన్ కీ బాత్) కార్యక్రమంలో భాగంగా కీలక విషయాలు వెల్లడించారు.
" ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో 2020 ఏడాది ఎప్పుడు ముగుస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ సంవత్సరం సవాళ్లతో కూడుకున్నదిగా భావిస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అదిగమించగలమని చరిత్ర చెబుతోంది. సమస్యలు వచ్చినప్పుడే మనం మరింత బలవంతులం అవుతాం."