భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆఫ్రికా దేశాల పర్యటనకు బయలుదేరారు. బెనిన్, గాంబియా, గినీ దేశాల్లో ఆయన ఏడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మూడు దేశాల్లో పర్యటిస్తున్న తొలి భారత రాష్ట్రపతి కోవింద్.
"రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ మధ్యాహ్నం బెనిన్లోని కోటోనౌకు చేరుకుంటారు. రేపు ఆ దేశ అధ్యక్షుడు పాట్రిస్ టాలోన్తో భేటీ అవుతారు. అనంతరం పోర్టో నోవోలోని జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో కోవింద్ భేటీ అవుతారు."- భారత విదేశాంగశాఖ