భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 129వ జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అంబేడ్కర్.. న్యాయం, సమానత్వంతో సమాజం కోసం చేసిన కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా రాష్ట్రపతి కొనియాడారు. దేశ ప్రజలంతా అంబేడ్కర్ నుంచి ప్రేరణ పొంది.. ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోవింద్ పిలుపునిచ్చారు.
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. దేశ ప్రజల తరఫున వినయపూర్వక నివాళులర్పించారు.
కాంగ్రెస్‌పై మండిపడ్డ నడ్డా..
భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా... అంబేడ్కర్‌కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అంబేడ్కర్‌కు కాంగ్రెస్ తగినంత గౌరవం ఇవ్వలేదని... ఆయన మరణించిన నాలుగు దశాబ్దాలకు భారతరత్న ఇచ్చారని ఆరోపించారు. కానీ, భాజపా ప్రణాళికాబద్ధంగా ఆయన ఆశయాలను నిజం చేస్తోందని చెప్పారు నడ్డా.