సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి భారతదేశం తన శక్తినంతా ఉపయోగిస్తుందని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఇటీవల చేసిన వైమానిక దాడులనుద్దేశించి రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచదేశాల్లో భారత కీర్తి ప్రతిష్టలు, ప్రగతి సాయుధ బలగాల సామర్థ్యం పైన ఆధారపడి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగిన భారత వైమానిక దళ కార్యక్రమంలో ప్రసంగించిన రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ శాంతికి కట్టుబడి ఉన్న దేశం. అయితే అవసరమైన సమయంలో దేనికీ వెనుకాడదు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి శక్తి సామార్థ్యాలన్ని వినియోగిస్తాం. సాయుధ బలగాల పట్ల పూర్తి విశ్వాసం ఉంది. దేశ రక్షణ కోసం మన బలగాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇటీవల ఓ తీవ్రవాద సంస్థ స్థావరాలపై జరిగిన వైమానిక దాడులు మన బలగాల శౌర్యానికి, నైపుణ్యానికి నిదర్శనం. -రామ్నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి