దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా వ్యాపిస్తోంది. నవజాత శిశువుల నుంచి వృద్ధుల వరకు కరోనాపై పోరాడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 980 గ్రాములున్న ఓ నవజాత శిశువుకు కరోనా సోకింది. ప్రస్తుతం మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
ఆగస్టు 13న పురిటినొప్పులతో నగరంలోని వాణీవిలాస ఆసుపత్రిలో చేరింది ఓ గర్భిణి. అనంతరం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును ఐదురోజుల పాటు చిన్నారుల ప్రత్యేక వార్డులో ఉంచారు. కరోనా పరీక్షల్లో వైరస్ సోకినట్లు తేలిన క్రమంలో విక్టోరియా యాక్సిడెంట్ కేర్ కేంద్రానికి తరలించారు వైద్యులు.