ప్రత్యేక రాష్ట్రం కోసం కలబురిగిలో ఆందోళన చేపట్టింది ప్రత్యేక కల్యాణ కర్ణాటక పోరాట సమితి. నిరసనకారులు రోడ్లపై బైఠాయించారు. కలబురిగి, యాదగిరి, బీదర్, కొప్పల్, బళ్లారి, రాయ్చుర్ జిల్లాలు అభివృద్ధికి నోచుకోవటం లేదని ఆరోపించారు.
'కల్యాణ కర్ణాటక' రాష్ట్రం కోసం ఆందోళనలు
కర్ణాటక కలబురిగి జిల్లాలో ఆందోళనలు చేపట్టింది ప్రత్యేక కల్యాణ కర్ణాటక పోరాట సమితి. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు నిరసనకారులు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.
ప్రత్యేక కల్యాణ కర్ణాటక పోరాట సమితి
నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. పలువురు పోరాట సమితి సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రాలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ