తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిల్డర్​ ఔదార్యం.. 42 కుటుంబాలకు ఉచిత వసతి

కరోనాతో ఇబ్బందులు పడుతోన్న వలస కార్మికులకు అండగా నిలిచి తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు గుజరాత్​కు చెందిన ఓ బిల్డర్​. నూతనంగా నిర్మించిన అపార్ట్​మెంట్లలో ఉచితంగా వసతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన భవనాల్లో 42 కుటుంబాలు వసతి పొందుతున్నాయి.

builder has accommodated 42 families
బిల్డర్​ ఔదార్యం.. 42 కుటుంబాలకు ఉచిత వసతి

By

Published : Sep 16, 2020, 5:15 PM IST

Updated : Sep 16, 2020, 10:45 PM IST

కరోనా మహమ్మారితో ప్రతి ఒక్కరిపై తీవ్ర ప్రభావం పడింది. పొట్ట చేతపట్టుకుని పట్టణాలకు వచ్చిన వలస కూలీల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. చేతిలో పనిలేక.. కుటుంబాన్ని పోషించలేక చాలా మంది కాలి నడకన సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. కొందరు భవిష్యత్తుపై ఆశలతో పట్టణాల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

బిల్డర్​ ఔదార్యం.. 42 కుటుంబాలకు ఉచిత వసతి

అలాంటి కుంటుంబాలకు అండగా నిలుస్తున్నారు గుజరాత్​లోని​ సూరత్​కు చెందిన ప్రకాశ్​​ భలాని అనే బిల్డర్​​. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న కుటుంబాలకు తనవంతుగా చేయూతనందిస్తున్నారు. నూతనంగా నిర్మించిన తన రుద్రాక్ష లేక్​ ప్యాలస్​ భవనాల్లో ఉచితంగా వసతి కల్పించి తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ 42 కుటుంబాలు వసతి పొందుతున్నాయి.

ప్రస్తుత సంక్షోభ సమయంలో వలస కార్మికులకు సాయం చేయటం వల్ల.. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చే అవకాశం లభించిందంటున్నారు భలాని.

"లాక్​డౌన్​ తర్వాత అన్​లాక్​ 1లో చాలా మంది పని లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ కనీసం అద్దె కట్టలేనివారు చాలా మంది ఉన్నారు. సూరత్​కు చెందిన ఓ వ్యక్తి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో తన వస్తువులను భవనంలో పెట్టుకునేందుకు చోటు ఇవ్వాలని కోరాడు. అతనికి ఒక గది ఇచ్చాను. అప్పుడే ఈ ఆలోచన తట్టింది. అతనిలా ఇబ్బందులు పడుతోన్న వారికి వసతి కల్పించాలనుకున్నాం."

- ప్రకాశ్​ భలాని, బిల్డర్​

ఇబ్బందుల్లో ఉన్నవారికి ఉచితంగా వసతి కల్పించాలని సంకల్పించుకున్న బిల్డర్​ భలాని.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించారు. విషయం తెలుసుకున్న చాలా మంది వసతి పొందేందుకు ఆయన్ను సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"మా భర్త వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. దానివల్ల కనీసం ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితులు వచ్చాయి. మా ఇంటి యజమాని​ ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. ఏమీ చేయలేక మా సొంత ఊరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అదే సమయంలో రుద్రాక్ష లేక్​ ప్యాలస్​ గురించి తెలుసుకుని, వారిని సంప్రదించాం. కేవలం రూ.1500 నిర్వహణ ఖర్చులు చెల్లించి ఇక్కడ ఉండొచ్చని బిల్డర్​ చెప్పారు. మాకు నచ్చినన్ని రోజులు ఉండేందుకు అవకాశం కల్పించారు. చాలా సంతోషంగా ఉంది. ఆ బిల్డర్​ మాకు దేవుడితో సమానం."

- ఆశా నిమావత్​, వసతి పొందుతున్న మహిళ

రూ.1500లకే.. అన్ని సౌకర్యాలు

ఆహారం సిద్ధం చేస్తు్న్న సిబ్బంది
వసతి కల్పించిన భవనాలు

రుద్రాక్ష లేక్​ ప్యాలస్​లో వసతి పొందుతున్న వారి నుంచి కేవలం రూ.1500లు నిర్వహణ ఖర్చుల నిమిత్తం వసూలు చేస్తున్నారు. ఆ సొమ్ముతో వైఫై, నీటి సౌకర్యం సహా ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం 42 కుటుంబాలు వసతి పొందుతుండగా.. మరింత మంది ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు భలాని. రుద్రాక్ష లేక్​ ప్యాలస్​లో 92 ఫ్లాట్లు ఉన్నాయి. వాటన్నింటినీ ఇబ్బందులు పడుతున్న వారికి కేటాయిస్తామని, వారు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారో అన్ని రోజులు నిశ్చింతగా ఉండొచ్చని చెబుతున్నారు.

ఇదీ చూడండి: ప్రకృతి ఒడిలో 'జీప్​ రేస్'​.. ఆ కిక్కే వేరప్పా!

Last Updated : Sep 16, 2020, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details