తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎవరి దమ్ము ఎంత? - WAR

పుల్వామా ఉగ్రదాడి, తదనంతర పరిణామాలు భారత్​-పాక్​ మధ్య యుద్ధాన్ని తలపించాయి. 'జైషే మహ్మద్' శిక్షణా కేంద్రం భారత మిరాజ్​ల ధాటికి తునాతునకలైంది. మెరుపు దాడుల్లో, వైమానిక పోరాటంలో చివరకు దౌత్య పరంగానూ గెలుపు భారత్​దే అయింది. పైకి శాంతి పాఠాలు వల్లిస్తుప్పటికీ పాక్​ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వీటిని భారత్​ సహిస్తుందా..? యుద్ధభేరి మోగిస్తే... రణస్థలంలో ఎవరి దమ్ము ఎంత..?

ఎవరి దమ్ము ఎంత?

By

Published : Mar 2, 2019, 11:47 AM IST

Updated : Mar 2, 2019, 12:11 PM IST

ముఖ్యదేశాల శక్తి సామర్థ్యాలు

పుల్వామా దాడిలో 40 మంది వీర సైనికులను కోల్పోయిన భరతమాత కన్నీళ్లు దాయాది దేశంపై మిరాజ్​లై బాంబుల వర్షం కురిపించాయి. ఉగ్ర స్థావరాలను తుత్తునియలు చేశాయి. 350 మంది ఉగ్రవాదులను మట్టిలో కలిపినట్లు సమాచారం. భారత పరాక్రమానికి పాక్​ దగ్గర సమాధానం కరవైంది.

దీటుగా బదులిస్తామని చెప్పిన పాక్​ అన్నంత పని చేసేందుకు విఫలయత్నం చేసింది. కశ్మీరులోని భారత సైనిక స్థావరాలపై ఎఫ్​-16తో బాంబుల వర్షం కురిపించడానికి ప్రయత్నించి తోకముడిచింది. ప్రతిఘటించే సమయంలో భారత మిగ్​-21 నేలకూలింది.

తప్పించుకుని నియంత్రణ రేఖ ఆవల పడిన భారత పైలట్​ అభినందన్​ను దాయాది దేశం బంధించింది. దౌత్య ఒత్తిడికి ఎట్టకేలకు ఇమ్రాన్ సర్కారు తలొగ్గక తప్పలేదు. భారత పైలట్​ సగర్వంగా స్వదేశంలో కాలుమోపారు. పైకి నీతి వ్యాఖ్యలు వల్లిస్తూ వెనుక కుట్రలు పన్నే అలవాటున్న పాక్ ఈ పరిణామాల దృష్ట్యా ఎలా వ్యవహరిస్తుందనే విషయాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

యుద్ధం మా అభిలాష కాదు అని దాయాది దేశం చెప్పుకొస్తుంది. అయితే సరిహద్దులో కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. భారత్​ ప్రతిసారి దీటుగా బదులిస్తోంది. ప్రస్తుతం యద్ధానికి తెరలేపే అంతటి దుస్సాహసానికి పాక్​ పాల్పడకపోవచ్చు. యుద్ధమే వస్తే గెలుపు మాట అటుంచి శత్రుదేశానికి నిలిచే శక్తి కూడా లేదు. కనుక ఎప్పటిలానే జిహాదీలను అడ్డుపెట్టుకొని తెర వెనుక తతంగం నడిపిస్తుందా?

ఈ పరిణామాల దృష్ట్యా ఇరు దేశాలు సైనిక బలం, ఆయుధ సామగ్రి వంటివి చర్చనీయాంశమయ్యాయి. యుద్ధమే వస్తే అసలు ఎవరి బలం ఎంత? ఒక దేశం పరాక్రమానికి దోహదం చేయడంలో కీలకమైనదిగా భావించే కొన్ని అంశాలను పరిశీలిద్దాం.

గ్లోబల్​ ఫైర్​ పవర్​-జీఎఫ్​పీ అనే సంస్థ 136 దేశాలకు సంబంధించిన 55 అంశాలను పరిగణనలోకి తీసుకొని సైనిక శక్తి ఎంత అనే దానిపై ర్యాంకులు, రేటింగ్​ ఇచ్చింది.

అమెరికా-'1'..భారత్-'4​'

ఈ ర్యాంకింగ్స్​లో అగ్రరాజ్యం అమెరికా 0.018 రేటింగ్​తో మొదటి స్థానంలో ఉంది. తరువాత రష్యా, చైనా. 0.1417 రేటింగ్​తో భారత్​ది 4వ స్థానం. 0.3689 రేటింగ్​తో పాక్​ది​ 17వ స్థానం.

ఏ ప్రాతిపదికన..?

* దేశంలో ఉన్న ఆయుధ సామగ్రి

* సైన్యం శక్తి సామర్థ్యాలు

* రక్షణ బడ్జెట్​

* అణ్వాయుధాలు, వాటిని ప్రయోగించడానికి వీలైన ప్రదేశాలు

* రాజకీయ నాయకత్వం, నిర్ణయాధికారం

ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం ఉన్న దేశంగా అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది.

సైనికుల సంఖ్యలో...

సైనిక బలం, ఆయుధాలు, యుద్ధ విమానాలు వంటి అంశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. దాదాపు 21 లక్షల సైన్యంతో మొదటి స్థానంలో చైనా ఉంది. దాదాపు 13 లక్షల సైన్యంతో రెండో స్థానంలో భారత్​ నిలిచింది.

దృఢమైన సైనికులు...

దృఢమైన సైనికులు కలిగిన దేశాలలో చైనాది అగ్రస్థానం. తరువాతి స్థానంలో భారత్​ ఉంది. అమెరికాది మూడో స్థానం.

5 ముఖ్య దేశాలు-5 విభిన్న సేనలు

క్రియాశీలక సైన్యం, యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు, సాయుధ నౌకలు, అణ్వాయుధాలు, రక్షణ బడ్జెట్​ ఇలా విభిన్న అంశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్​, పాకిస్థాన్ మిగిలిన దేశాల కన్నా చాలా శక్తిమంతమైనవి. భూమి, ఆకాశం, నీరు ఇలా ఎక్కడైనా యుద్ధం చేయడానికి ఈ దేశాలకున్న సామర్థ్యం చాలా ఎక్కువ.

భారత్​ పాకిస్థాన్​
సైనిక బలం 13,62,500 6,37,000
యుద్ధ విమానాలు 2185 1281
సైనిక హెలికాఫ్టర్లు 720 328
యుద్ధ ట్యాంకులు 4426 2182
సాయుధ నౌకలు 295 197
అణ్వాయుధాలు 135 145
రక్షణ బడ్జెట్ (లక్షల కోట్లలో) 3.05 1

భారత్, పాకిస్థాన్​ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. పాకిస్థాన్​ ఎప్పటికప్పుడు అణ్వాయుధాల విషయంలో నాటకీయంగా వ్యవహరిస్తోంది. అణ్వాయుధాలను వినియోగించాల్సిన అవసరం ఇప్పటివరకు భారత్​కు రాలేదు. అది ప్రస్తుత పరిణామాల ప్రభావంతో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

Last Updated : Mar 2, 2019, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details