రానున్న బిహార్ ఎన్నికలు, మధ్యప్రదేశ్‌లో 24 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటివరకు 80 ఏళ్లు పైబడిన వారికి ఉన్న పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో 65 ఏళ్లు పైబడిన అందరికీ వర్తింపజేసింది.
కరోనా బాధితులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం - బిహార్ ఎన్నికలు
కరోనా బాధితులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. బిహార్, మధ్యప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 65 ఏళ్ల పైబడినవారికీ ఈ అవకాశం కల్పించింది.
పోస్టల్ బ్యాలెట్
అలాగే కరోనా పాజిటివ్ వ్యక్తులు, హోం క్వారంటైన్‌లో ఉన్నవారికీ ఈ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. బిహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 26తో ముగియనున్న నేపథ్యంలో ఆలోపే అక్కడ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. కొవిడ్ సమయంలోనూ ఎన్నికలు నిర్వహించడానికే ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.