తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరోసారి ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్​ - భద్రతా దళాలు

జమ్ముకశ్మీర్​ నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు. పాక్ ​దాడిని భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి.

మరోసారి ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్​

By

Published : May 5, 2019, 6:59 PM IST

Updated : May 6, 2019, 12:32 AM IST

మరోసారి ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్​

జమ్ముకశ్మీర్​లో సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ బలగాలు మరోసారి కాల్పులు జరిపాయి. భారత భద్రతాదళాలు దాడిని ధీటుగా తిప్పికొట్టాయి.

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్థాన్​ బలగాలు పూంచ్​, రాజౌరీ జిల్లాల్లో​ మోర్టార్లతో దాడులకు పాల్పడ్డాయి. భారత సైనిక పోస్టులపై కాల్పులు జరిపాయి. ఈ దాడిలో చల్లాస్​ గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నేటి ఉదయం 11 గంటల సమయంలో రాజౌరీలోని ఖేరీ సెక్టార్​లో, పూంచ్​లోని కృష్ణఘటి సెక్టార్​​ వద్ద పాక్​ కాల్పులకు పాల్పడిందని, దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత సైనిక అధికారులు తెలిపారు.

పూంచ్​లోని షాపూర్​, కిర్నీ, కస్బా సెక్టర్లపై పాక్ బలగాలు గురువారం​ కూడా కాల్పులకు పాల్పడ్డాయి.

ఇదీ చూడండి: 'ఫొనిపై మోదీతో దీదీ ఫోన్​లో మాట్లాడలేదు'

Last Updated : May 6, 2019, 12:32 AM IST

ABOUT THE AUTHOR

...view details