తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టార్గెట్​ యూపీ... ప్రియాంక వ్యూహం ఫలించేనా? - ఉత్తరప్రదేశ్

2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారు. కార్యకర్తలతో మమేకమవుతూ పార్టీని క్షేతస్థాయిలో బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. లోక్​సభకు ఎన్నికయిన 11మంది రాష్ట్ర శాసనసభ్యుల రాజీనామాల ద్వారా వచ్చే ఉపఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రియాంక పర్యటనలు

By

Published : Jun 17, 2019, 5:31 AM IST

Updated : Jun 17, 2019, 7:30 AM IST

టార్గెట్​ యూపీ... ప్రియాంక వ్యూహం ఫలించేనా?

లోక్​సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం పార్టీలో నూతనోత్సాహం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యులుగా ఉండి లోక్​సభకు ఎన్నికయిన 11 మంది నేతల రాజీనామాల ద్వారా అసెంబ్లీకి ఉపఎన్నికలు రానున్నాయి. 2022లో యూపీ​ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్త​ల్లో నూతనోత్సాహం నింపేందుకు తూర్పు యూపీ బాధ్యురాలైన ప్రియాంక యత్నిస్తున్నారు. వారానికి రెండు సార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎలాంటి ముందస్తు అపాయింట్​మెంట్ లేకుండా కార్యకర్తలను కలుస్తున్నారు.

లోక్​సభ ఎన్నికల ఫలితాల అనంతరం కార్యకర్తలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. కార్యకర్తలు, నేతల మధ్య సహకారం, సమన్వయాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో యూపీలో ప్రియాంక మరిన్ని పర్యటనలు చేపట్టనున్నారు.

తన తల్లి, యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీతో కలసి రాయ్​బరేలీలో బుధవారం ప్రియాంక పర్యటించారు. ఈ సందర్భంగా లోక్​సభ ఎన్నికల ప్రచారంలో కొంతమంది కార్యకర్తలు సరిగా పనిచేయలేదని ఆరోపించారని సమాచారం.

80 లోక్​సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్​లో కేవలం సోనియా గాంధీ పోటీ చేసిన నియోజకవర్గం రాయ్​బరేలీలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.

ఇదీ చూడండి: నేటి నుంచే 17వ లోక్​సభ తొలి సమావేశాలు

Last Updated : Jun 17, 2019, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details