చెదురుమదురు సంఘటనలు మినహా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 95 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆరంభంలో కొంత మందకొడిగా సాగినా క్రమంగా పోలింగ్ ఊపందుకుంది.ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఈ విడతలో 61.12 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఎన్నికల్లో పెద్దసంఖ్యలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పోలింగ్ ఆరంభంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల పండుగలో యువత, వృద్ధులు, దివ్యాంగులు ఆసక్తి కనబరిచారు. నవదంపతులూ పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి ఓటేశారు.