పార్టీ నేతలతో మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ చేపట్టిన సమావేశాన్ని మధ్యలో ఆపేశారు ఎన్నికల తనిఖీ అధికారులు. మైకుల వినియోగం కోసం అనుమతులు తీసుకోకపోవడమే కారణమని చెప్పారు. ఈ సమావేశాన్ని కోయంబత్తూరులోని ఓ పాఠశాల హాలులో నిర్వహించారు.
అనుమతిలేదని.. కమల్ సమావేశంలో మైక్ కట్ - కమల్ హాసన్
పార్టీ శ్రేణులతో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ నేడు సమావేశం నిర్వహిస్తుండగా అడ్డుకున్నారు ఎన్నికల అధికారులు. మైక్ వినియోగించేందుకు అనుమతులు తీసుకోకపోవడమే ఇందుకు కారణం.
కమల్ హాసన్
కొద్దిపేసపటి తర్వాత మైకు లేకుండానే కమల్ హాసన్ ప్రసంగించారని, సమావేశం కొనసాగిందని చెప్పారు ఎంఎన్ఎం నేతలు.