తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల పుణ్యాన పాఠశాలలకు వెలుగొచ్చింది..!

సార్వత్రిక ఎన్నికల నిర్వహణ వల్ల మధ్యప్రదేశ్​, బిహార్​ల్లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల విద్యార్థుల కష్టాలు తీరాయి. అప్పటిదాకా లేని కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్ లాంటి సౌకర్యాలు ఎన్నికల మూలంగా సమకూర్చారు అధికారులు. స్వయంగా ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నివేదికే ఈ విషయం స్పష్టం చేసింది.

'ఎన్నికలతో.. పాఠశాలలకు విద్యుత్​ సౌకర్యం'

By

Published : May 26, 2019, 8:12 PM IST

కనీస మౌలిక వసతులు లేని పలు గ్రామీణ పాఠశాలల్లో సార్వత్రిక ఎన్నికల పుణ్యాన సమస్యలు తీరాయి. అప్పటి వరకూ లేని తాగునీరు, విద్యుత్​ సౌకర్యం ఎన్నికల దెబ్బకు చిటికెలో వచ్చేశాయి. ఎన్నికలేంటి... ఈ సౌకర్యాలేంటి.. అసలు వీటికి ఏం సంబంధం అని సందేహం కలిగిందా? ఇంతకీ విషయం ఏంటంటే...

మధ్యప్రదేశ్​లో..

2019 సార్వత్రిక ఎన్నికల వల్ల మధ్యప్రదేశ్​ గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 15,000 పాఠశాలలకు శాశ్వత విద్యుత్తు సౌకర్యం కలిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) అధికారిక నివేదిక స్పష్టం చేస్తోంది.

ఎన్నికల నిర్వహణ కోసం గ్రామీణ పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా మార్చారు. మధ్యప్రదేశ్​లోని జబువా, రత్లాం, బేతుల్​, బింఢ్​ లాంటి గ్రామీణ ప్రాంత పాఠశాలలను మొదటిసారిగా పోలింగ్​ కేంద్రాలుగా వినియోగించారు.

ఈ పాఠశాలల్లో కనీస వసతులు లేవు. ఈవీఎమ్​లు, వీవీప్యాట్​లు అలాగే ఇతర ఎన్నికల సామగ్రి పనిచేయడం కోసం విద్యుత్తు తప్పనిసరి. అందుకోసం ఈ పాఠశాలలకు విద్యుత్​ సౌకర్యం కల్పించారు. మరికొన్ని విద్యాలయాల్లో భవన మరమ్మత్తులు చేశారు. మంచి నీటి వసతులూ సమకూర్చారు. ఆ విధంగా ఎన్నికలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించినట్లు ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించిన నివేదిక స్పష్టం చేసింది.

బిహార్​లోనూ...

ఎన్నికల నిర్వహణ వల్ల బిహార్​లోని గ్రామీణ పాఠశాలలూ లబ్ధి పొందాయని బిహార్ సీఈవో నివేదిక తెలిపింది. ఎన్నికల పుణ్యమా అని శిథిలమైన పైకప్పులు, గోడలు గల సుమారు ఓ డజను పాఠశాలలు మరమ్మతులకు నోచుకున్నాయి. వాటికి రంగులు కూడా వేశారు. వీటితోపాటు ఫ్యాన్​లు, బల్బులు తదితరాలనూ అమర్చారని సీఈవో నివేదిక స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఫోన్​

ABOUT THE AUTHOR

...view details