తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పవార్​పై కేసు... రాజకీయ అవకాశవాదమే'

నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత శరద్​ పవార్​పై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ కేసు నమోదు చేయటం రాజకీయ అవకాశవాదమని అభివర్ణించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్​ వేదికగా విమర్శలు గుప్పించారు.

'పవార్​పై చర్యలు రాజకీయ అవకాశవాదం'

By

Published : Sep 27, 2019, 12:37 PM IST

Updated : Oct 2, 2019, 5:03 AM IST

'పవార్​పై కేసు... రాజకీయ అవకాశవాదమే'

మనీలాండరింగ్​ కేసులో నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు శరద్​ పవార్​పై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కేసు నమోదు చేయటంపై విమర్శలు చేశారు రాహుల్​ గాంధీ. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు ఆయనను లక్ష్యంగా చేసుకోవటం రాజకీయ అవకాశవాదమని ఆరోపించారు. కేసులు పెట్టడం వెనుక రాజకీయ దురుద్దేశముందని ట్విట్టర్​ వేదికగా విమర్శించారు.

రాహుల్​ గాంధీ ట్వాట్​

కాసేపట్లో ఈడీ ముందుకు..

మనీలాండరింగ్‌ కేసులో ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌ మరికాసేపట్లో ఈడీ ముందు హాజరుకానున్నారు. మహారాష్ట్ర సహకార బ్యాంకులో జరిగిన మనీలాండరింగ్‌ కుంభకోణానికి సంబంధించి శరద్‌ పవార్‌, ఆయన మేనల్లుడు అజిత్‌ పవార్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. తమ ముందు హాజరు కావాలని ఇద్దరికీ సమన్లు జారీ చేసింది.

భద్రత కట్టుదిట్టం..

పవార్‌ విచారణ నేపథ్యంలో ముంబయిలోని ఈడీ కార్యాలయ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్​సీపీ కార్యాలయం కూడా ఇదే ప్రాంతంలో ఉన్నందున ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలపకుండా 144 సెక్షన్ విధించారు.

ఎన్​సీపీ నేతల ఆందోళనలు..

శరద్​ పవార్​పై కేసు నమోదు చేయటాన్ని నిరసిస్తూ ఎన్​సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున గుమిగూడి, నిరసనల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చూడండి: రహదారిని మింగిన వాగులో లారీ పల్టీ

Last Updated : Oct 2, 2019, 5:03 AM IST

ABOUT THE AUTHOR

...view details