కేరళ సచివాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగి బంగారం స్మగ్లింగ్ దర్యాప్తు పత్రాలు కాలిన ఘటనపై కాంగ్రెస్, భాజపా ఆందోళన బాట పట్టాయి. ఈ వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ ఇరు పార్టీలు తీవ్ర స్థాయిలో నిరసన చేపట్టాయి. ఫలితంగా తిరువనంతపురంలోని సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
'గోల్డ్ స్మగ్లింగ్'పై భాజపా నిరసన- పోలీసులతో ఘర్షణ - కేరళ సచివాలయంలో మంటలు
కేరళలో బంగారం స్మగ్లింగ్ దర్యాప్తు పత్రాలు కాలిన ఘటనపై కాంగ్రెస్, భాజపా చేపట్టిన ఆందోళనల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాంగ్రెస్ శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కాసేపటికే ప్రదర్శనగా వచ్చిన భాజపా కార్యకర్తలపై బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించారు.
గోల్డ్ స్మగ్లింగ్ నిరసనకారులకు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం
భాజపా కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని ముందుకు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేయగా.... పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు.
ఇదీ చూడండిరెండు బస్సులు ఢీ- ఆరుగురు మృతి