మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కాంగ్రెస్, భాజపా నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్వాలియర్ పట్టణంలో వేయిపడకల ఆస్పత్రికి శిలాఫలకం వేసేందుకు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య వచ్చారు. ఈ కార్యక్రమంపై భాజపా నిరసన వ్యక్తం చేసింది. ఈ సమయంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.
పోలీసుకు లీడర్ చెంపదెబ్బ - కాంగ్రెస్,
మధ్యప్రదేశ్ గ్వాలియర్లో పోలీసులపై భాజపా నేత జశ్వంత్ సింగ్ చేయి చేసుకున్నారు. ఆసుపత్రికి శిలాఫలకం సందర్భంగా కాంగ్రెస్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. అదుపు చేసేందుకు వచ్చిన పోలీసును భాజపా నేత జశ్వంత్ చెంపదెబ్బ కొట్టారు.
పోలీసులపై చేయి చేసుకున్న జశ్వంత్
ఇరు పక్షాలను ఆపే ప్రయత్నం చేసిన పోలీసులపై భాజపా నేత జశ్వంత్ సింగ్ చేయిచేసుకున్నారు. ఆగ్రహించిన పోలీసులు జశ్వంత్ సింగ్ను చితక బాదారు. ఇరు వర్గాలపై లాఠీ చార్జ్ చేసినా ఉద్రిక్తతలు అదుపులోకి రానందున పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు.